సీఎం రేవంత్ రెడ్డికి పీఎం మోదీ విషెస్​

సీఎం రేవంత్ రెడ్డికి పీఎం మోదీ విషెస్​

న్యూఢిల్లీ /హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను..’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

చంద్రబాబు, లోకేష్‌‌‌‌‌‌‌‌ గ్రీటింగ్స్​

రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌‌‌‌‌‌‌ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.