రామ మందిర ప్రారంభోత్సవం : మోదీ అయోధ్య షెడ్యూల్ ఇదే

రామ మందిర ప్రారంభోత్సవం :  మోదీ అయోధ్య షెడ్యూల్ ఇదే

అయోధ్యలో మరికొన్ని గంటల్లో  బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.  సరిగ్గా మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది.  ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి ఆయన  సోమవారం ఉదయం ఢిల్లీ నుండి అయోధ్యకు బయలుదేరుతారు.  మోదీ మొత్తం ఆరు గంటల పాటు అయోధ్యలో పర్యటిస్తారు.  రామమందిరం ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేళ.. ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిద్దాం.  

  • ఉదయం 10.25 గంటలకు కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు, 
  • ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోదీ అయోధ్య లోని హెలిప్యాడ్ చేరుకుంటారు. 
  • ఉదయం 10.55 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ లేదా శంకుస్థాపన కార్యక్రమం కోసం ప్రధాని శ్రీరామ జన్మభూమికి చేరుకుంటారు. 
  • మధ్యాహ్నం 12.05-12.55 గంటల మధ్య ఎంతగానో ఎదురు చూస్తున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుక జరుగుతుంది. 
  • మధ్యాహ్నం 1.00 గంటలకు శంకుస్థాపన పూర్తియన తర్వాత ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమం జరిగే ప్రదేశానికి చేరుకుంటారు 
  • మధ్యాహ్నం 1.00-2.00 గంటల మధ్య ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. గంటపాటు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 
  • మధ్యాహ్నం 2.00 గంటలకు అయోధ్యలోని కుబేర్ తిలా ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. 

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో 11 రోజుల దీక్ష చేపట్టారు ప్రధాని మోదీ.. కఠిన నియమాలు పాటించారు. రోజూ నేలపైనే నిద్రించారు.  కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు.  అలాగే దేశవ్యాప్తంగా దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు.  రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం నియమ నిష్ఠలతో 11 రోజుల పాటు పూజలు చేస్తానని మోదీ గత శుక్రవారం ప్రకటించారు.