ఈ కోర్ట్స్ ప్రాజెక్టు ప్రారంభించిన మోడీ

ఈ కోర్ట్స్ ప్రాజెక్టు ప్రారంభించిన మోడీ

ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆవరణలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో వర్చువల్ జస్టిస్ క్లాక్, డిజిటల్ కోర్టు, జస్టిస్ మొబైల్ యాప్ 2.0, S3WaaS వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్ సైట్లు ఈ కోర్ట్స్ ప్రాజెక్టులో ఉన్నాయి. వర్చువల్ జస్టిస్ క్లాక్  ద్వారా రోజు, వారం లేదా నెలవారీగా పరిష్కరించిన కేసులు, పెండింగ్ కేసుల వివరాలను తెలియజేయనున్నారు. కేసుల స్టేటస్ ను పబ్లిక్ కు  తెలియజేయడం ద్వారా న్యాయస్థానాల పనితీరును పారదర్శకంగా ఉంచే ప్రయత్నం జరుగుతోంది. కక్షిదారులు,  లాయర్లు, న్యాయ వ్యవస్థలకు డిజిటల్ సేవలు అందించనున్నారు.   

భారత్ వైపు ప్రపంచం చూపు

అభివృద్ధి  చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఇమేజ్ పెరుగుతోందని మోడీ అభిప్రాయపడ్డారు. యావత్ ప్రపంచం దృష్టి భారత్ పైనే ఉందని మోడీ చెప్పారు.  దేశం ముందు ఎన్నో కొత్త అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అన్ని అడ్డంకులు దాటుకుంటూ ముందుకు వెళుతున్నామని మోడీ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్టను పెంచడమే తన కర్తవ్యం అని మోడీ చెప్పారు.

14 ఏండ్ల క్రితం ఇదే రోజున  రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ముంబైలో టెర్రర్ అటాక్ జరిగిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించాడు.