
స్వతంత్ర్య భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని కేవాడియాలో ఉన్న స్టాట్యు ఆఫ్ యూనిటీ దగ్గర నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తర్వాత ఐక్యతా పరేడ్ ను వీక్షించారు మోడీ. విద్యార్థులు, గుజరాత్ పోలీస్ బలగాలు ఐక్యతా పరేడ్ నిర్వహించాయి. తర్వాత విద్యార్థులు, ప్రజలతో మోడీ ప్రతిజ్ఞ చేయించారు. పుల్వామా ఉగ్రవాద ఘటనలో అమరుడైన హవల్దార్ నసీర్ అహ్మద్ సతీమణి షాజియా రాష్ట్రీయ్ పున:స్మారక్ స్మృతి చిహ్నాన్ని మోడీకి అందించారు.