బీచ్ లో బీరు బాటిల్స్ తీసివేసిన మోడీ

బీచ్ లో బీరు బాటిల్స్ తీసివేసిన మోడీ

ప్రధాని మోడీ అందరికీ ఆదర్శంగా నిలిచారు. మహాబలిపురంలో ఉన్న ఆయన ఈ ఉదయం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. బీచ్ లో పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి వేశారు. చాలా సేపు బీచ్ దగ్గరే ఉన్న ప్రధాని.. చేతిలో బ్యాగ్ పట్టుకుని.. ప్లాస్టిక్ చెత్తనంతా అందులో వేశారు. బీచ్ లో తాగేసిన బీరు బాటిల్స్ ను కూడా తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా..మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ప్రధాని లాంటి వ్యక్తి బాటిల్స్ వేరి పడేయడం చాలా గొప్ప విషయం.. అతన్ని చూసి మనందరం నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవాళ్టి షెడ్యూల్

మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. తాను బస చేసిన ఐటీసీ చోలా నుంచి ఫిషర్ మెన్ కోవా రిసార్ట్ కు బయలు దేరారు జిన్ పింగ్. కాసేపట్లో  ప్రధాని మోడీ, జిన్ పింగ్ సమావేశం కానున్నారు. ఇద్దరు అగ్రనేతల మధ్య  సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు జరగనుంది.  పలు కీలక అంశాలపై  ఫేస్ టూ ఫేస్ మాట్లాడుకోనున్నారు జిన్ పింగ్, మోడీ. తర్వాత ఇరు దేశాల మధ్య  ప్రతినిధిస్థాయి చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, ఉగ్రవాద సమస్యలపైనా చర్చించనున్నట్లు సమాచారం. అక్కడే జిన్ పింగ్ కు లంచ్ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. లంచ్ తర్వాత చెన్నై చేరుకోనున్న జిన్ పింగ్ అక్కడి నుంచి నేపాల్ పర్యటనకు వెళతారు.