
ప్రధాని మోడీ ప్రయాగ్ రాజ్ లో స్వచ్ఛ కార్మికులను సన్మానించారు. ఐదుగురు కార్మికుల కాళ్లు కడిగారు. అనంతరం వారిని సన్మానించారు. అర్ధ కుంభమేళాలో పగలూ రాత్రి తేడా లేకుండా త్రివేణి సంగమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని, వారి కష్టానికి వెల కట్టలేమన్నారు ప్రధాని. అందుకే సఫాయి కార్మికుల కాళ్లు కడిగినట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. డిసెంబర్ తర్వాత మోడీ ప్రయాగ్ రాజ్ రావడం ఇది రెండోసారి. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని మోడీయే. పుణ్యస్నానం చేశాక త్రివేణీ సంగమ తీరంలో హారతి కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పూజల్లో పాల్గొన్నారు.
प्रधानमंत्री श्री @narendramodi ने प्रयागराज कुम्भ में स्वच्छाग्रहियों के सम्मान में उनके चरण धोए। pic.twitter.com/x39u8JgyVe
— BJP (@BJP4India) February 24, 2019