దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడుకోవాలి.. లాస్ట్ ఆప్షన్ అదే

దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడుకోవాలి.. లాస్ట్ ఆప్షన్ అదే

దేశం అతిపెద్ద యుద్ధం చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. కరోనా సెకండ్ వేవ్ తుఫాన్ లా వచ్చిందన్నారు. మనమందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందామన్నారు.  ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పో కూడదన్నారు. వైద్య సిబ్బందికి సెల్యూట్ తెలిపిన మోడీ..అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందన్నారు. కరోనా సంక్షోభం నుంచి తప్పక బయటపడాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సప్లై పెంచేందుకు పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రాల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రాలకు లక్ష సిలిండర్లు పంపిస్తున్నామన్నారు. మన దేశంలో అతిపెద్ద ఫార్మా సెక్టార్ ఉందన్నారు. ఫార్మారంగం మందుల ఉత్పత్తి పెంచిందన్నారు. మన దగ్గర తక్కువ ధరకు వ్యాక్సిన్ లభిస్తుందన్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్ వేగంగా పెంచుతున్నామన్నారు. మే 1 నుంచి 18ఏళ్లు నిండియ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు.

50 శాతం వ్యాక్సిన్ రాష్ట్రాలు, హాస్పిటల్స్ కొనుక్కోవచ్చన్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు. వలస కార్మికులు ఎక్కడికీ వెళ్ళొద్దన్నారు. ఎక్కడి వారు అక్కడ వ్యాక్సిన్ వేసుకుని పనిచేసుకోవచ్చన్నారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వ్యాక్సిన్లకు అనుమతిచ్చామన్నారు. యువకులు గ్రూపులుగా ఏర్పడి కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు. దీని వల్ల కంటోన్మెంట్ జోన్స్, లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలన్నారు. లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే పరిగణించాలన్నారు.