వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేస్తున్నాం: మోదీ

వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేస్తున్నాం: మోదీ

ఎన్నికల ముందు ప్రకటనలు చేసి గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై మోదీ ఫైరయ్యారు.  గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి కనుమరుగయ్యేవని విమర్శించారు.

 గత ప్రభుత్వ హయాంలో చెరుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని.  రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ చెప్పారు. మా ప్రభుత్వం రైతులు పండించే పంటలకు అత్యధిక మద్దతు ధర కల్పించామన్నారు.. వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేస్తున్నామని... సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీని మార్చేసిందని.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలో యూపీ గణమైన అభివృద్ధి సాధించిందన్నారు. విపక్షాలు నినాదాలకే పరిమితమయ్యారని.. మా ప్రభుత్వం చేసి చూపించిందని మోదీ అన్నారు.