రేపు పూణెలో ప్రధాని మోడీ పర్యటన

రేపు పూణెలో ప్రధాని మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ రేపు పూణెలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు 32 కిలోమీటర్ల పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు మోడీ. ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రధాని పూణె చేరుకుని ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గార్వేర్ మెట్రో స్టేషన్ లో ఎగ్జిబిషన్ ను  పరిశీలించిన అనంతరం ఆనంద్ నగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైడ్ ను చేపట్టనున్నారు. ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ ను 2016 డిసెంబర్ 4న మోడీ శంకుస్థాపన చేశారు. 11వేల 400 కోట్లకుపైగా వ్యయంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో మెరుగైన మౌలిక వసతులు కల్పించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించారు. పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని మోడీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూణెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. 

మరిన్ని వార్తల కోసం

సమతామూర్తి విగ్రహంపై నారాయణ కీలక వ్యాఖ్యలు

మోడీజీ ప్లీజ్ హెల్ప్... కశ్మీరీని పెళ్లాడిన ఉక్రెయిన్ యువతి