గుజరాత్‌‌లో పర్యటించనున్న మోడీ

 గుజరాత్‌‌లో పర్యటించనున్న మోడీ
  • 30న వందే భారత్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలు ప్రారంభం
  • అహ్మదాబాద్‌‌లో ప్రారంభించనున్న ప్రధాని మోడీ 

న్యూఢిల్లీ: గుజరాత్‌‌లో వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌‌‌‌ 29 నుంచి రెండ్రోజుల పాటు గుజరాత్‌‌లో పర్యటించనున్న మోడీ, సెప్టెంబర్‌‌‌‌ 30న గాంధీనగర్‌‌‌‌, -ముంబై సెంట్రల్‌‌ వందే భారత్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలును ప్రారంభిస్తారు. తర్వాత అహ్మదాబాద్‌‌ మెట్రో ప్రాజెక్ట్‌‌ మొదటి దశను  కూడా స్టార్ట్‌‌ చేస్తారు. తర్వాత వీటిల్లో ఆయా రూట్లలో ప్రయాణించనున్నారు. వీటితో పాటు రూ.29 వేల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని పీఎంవో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సూరత్‌‌లో రూ.3,400 కోట్లకు పైగా, భావ్‌‌నగర్‌‌‌‌లో రూ.5,200 కోట్లు, అంబాజీలో రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసి, ప్రారంభిస్తారు. భావ్‌‌నగరలో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ టర్మినల్‌‌కు శంకుస్థాపన చేయనున్నారు. అహ్మదాబాద్‌‌లో నవరాత్రి ఉత్సవాల్లో కూడా ప్రధాని మోడీ పాల్గొంటారు.