ప్రధాని మోడీ చెప్పింది కరెక్టే

 ప్రధాని మోడీ చెప్పింది కరెక్టే

ఇటీవల జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని, ప్రధాని మోడీ చెప్పిన మాట సరైందేనని అన్నారు. పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాని, సార్వభౌమాధికారానికి సమిష్టి సమయమని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని చేసిన కామెంట్లకు ఇదే తరహాలో మద్దతు పెరుగుతూ వస్తోంది. యూఎస్ఏ సైతం మోడీ వ్యాఖ్యలను ప్రశంసించింది. ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ పత్రికలూ ప్రధాని మోడీని పొగుడుతూ కథనాలు ప్రచురించారు. రష్యాతో సుధీర్ఘ సంబంధాలున్న భారత్.. యుద్ధం ముగిసే సమయమని చెప్పడాన్ని అందరూ కీర్తిస్తున్నారు. 

గత కొన్ని రోజుల క్రితం షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ ఉజ్బెకిస్తాన్ లోని సమర్ కండ్ కి వెళ్లారు. అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమైన మోడీ.. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని, మీ వైఖరి గురించి తెలుసని, యుద్ధాన్ని త్వరలోనే ముగించాలనుకుంటున్నామన్నారు. దీంతో పాటు ఆహార భద్రత, ఇంధన సంక్షోభం వంటి వాటిపైనా వీరిద్దరూ చర్చించారు. అందులో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించినందుకు మోడీ, పుతిన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.