మన పండుగలకు లోకల్ వస్తువులే కొందాం..వోకల్ ఫర్ లోకల్

మన పండుగలకు లోకల్ వస్తువులే కొందాం..వోకల్ ఫర్ లోకల్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలంతా లోకల్ వస్తువుల్నే కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గణేశ్ చతుర్థి, ధంతేరాస్, దీపావళి, ఇతర పండుగలు వరుసగా వస్తున్నాయని.. ఈ పండుగల సందర్భంగా చిన్నవైనా, పెద్దవైనా లోకల్ ప్రొడక్టులనే కొనుగోలు చేయాలన్నారు. ముందుగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని అనుసరించాలని, ఆ తర్వాత మన చేతివృత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లో గుర్తింపు దక్కేలా చూద్దామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన యశోభూమి కన్వెన్షన్ సెంటర్ (ఫేజ్ 1)ను ఆదివారం ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. వోకల్ ఫర్ లోకల్ (స్థానిక ఉత్పత్తుల కోసం గొంతెత్తడం) నినాదాన్ని పాటించడం దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మన దేశంలోని లోకల్ ప్రొడక్టులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ‘ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసీసీ- –యశోభూమి)’ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలోని ప్రతి కార్మికుడికి, ప్రతి విశ్వకర్మకు యశోభూమిని అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ఆదివారం విశ్వకర్మ జయంతి, తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించారు. 

చేతివృత్తుల కళాకారులతో ముచ్చట్లు.. 

యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన తర్వాత ప్రధాని అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన చేతివృత్తుల కళాకారులతో మాట్లాడారు. కుండలు తయారుచేసే వారు, టైలర్లు, మేస్త్రీలు, చర్మకారుల వంటి వారిని కలిసి వారి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా 
విశ్వకర్మలకు ఆయన గ్రీటింగ్స్ తెలిపారు. మన దేశం అనేక రకాల చేతివృత్తులతో వైవిధ్యభరితంగా ఉందని పేర్కొన్నారు. 

కాన్ఫరెన్స్ టూరిజానికి ఢిల్లీ హబ్  

మన దేశంలో కాన్ఫరెన్స్ టూరిజానికి ఎంతో డిమాండ్ ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. దేశంలో ఈ ఇండస్ట్రీ విలువ రూ. 25 వేల కోట్ల మేరకు ఉండొచ్చన్నారు. యశోభూమిలో కాన్ఫరెన్స్​లు, ఎగ్జిబిషన్లకు, ఈవెంట్లకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. 

Also Rard :--ఎన్నికల్లో గెలుపుపై చర్చించాం .. తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఉత్తమ్

ఒక్క యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ద్వారానే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 వేల పెద్ద ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయని, మన దేశంలోనూ భవిష్యత్తులో కాన్ఫరెన్స్ టూరిజానికి ఎంతో స్కోప్ ఉందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపం, యశోభూమి కన్వెన్షన్ సెంటర్లు ప్రపంచస్థాయిలో కాన్ఫరెన్స్ టూరిజానికి కీలక వేదికలుగా నిలుస్తాయన్నారు. 

మెట్రోలో ప్రయాణం..  

‘యశోభూమి ద్వారక సెక్టార్ 25’ మెట్రో స్టేషన్ వరకు పొడిగించిన ఢిల్లీ మెట్రో ఎయిర్ పోర్ట్ లైన్​ను కూడా ప్రధాని ప్రారంభించారు. 2 కి.మీ. పొడవున్న ఈ ఎక్స్ టెన్షన్ రూట్​తో యశోభూమికి కనెక్టివిటీ పెరగనుంది. ఈ సందర్భంగా ఆయన ధౌలా కౌన్ స్టేషన్ నుంచి యశోభూమి స్టేషన్ వరకూ మెట్రోలో ప్రయాణించారు. ట్రెయిన్​లో పిల్లలు, ప్యాసింజర్లతో మోదీ ముచ్చటించారు. ఆదివారం ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్యాసింజర్లు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. 

యశోభూమి విశేషాలు 

  • మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం: 8.9 లక్షల చదరపు మీటర్లు
  • ఫేజ్ 1 విస్తీర్ణం: 1.8 లక్షల చదరపు మీటర్లు
  • నిర్మాణ వ్యయం: రూ. 5,400 కోట్లు 
  • మీటింగ్స్, కాన్ఫెరెన్స్ లు, ఎగ్జిబిషన్ లకు ఉపయోగపడే ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇదే కానుంది. 
  • మెయిన్ ఆడిటోరియంతో పాటు 15 కన్వెన్షన్ హాల్స్, 
  • 13 మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకేసారి 11 వేల మందికి ఆతిథ్యం. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ మీడియా తెర ఏర్పాటు. 
  • ప్లీనరీ హాల్​లో ఒకేసారి 6 వేల మందికి సీటింగ్ కెపాసిటీ. 
  • ఆడిటోరియాన్ని ఫ్లాట్ ఫ్లోర్ గా కూడా వాడుకోవచ్చు.