
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ యూట్యూబ్ చానల్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో దేశాధినేతల్లో అత్యధిక సబ్ స్ర్కైబర్లు ఉన్న లీడర్‌గా మోదీ నిలిచారు. అలాగే, ప్రపంచ నేతల్లో ఎవరూ కూడా ఆయన దరిదాపుల్లోలేరు. మోదీ తన చానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలు 450 కోట్లకు పైగా వ్యూస్ కలిగి ఉన్నాయి. బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ బోల్సనారో 64 లక్షల మంది సబ్ స్ర్కైబర్లతో రెండో స్థానంలో ఉన్నారు. వ్యూస్‌పరంగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ 22.4 కోట్లతో మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 7.89 లక్షల మంది సబ్ స్ర్కైబర్లు ఉన్నారు.