nuking Gaza comment: యుద్ధం టైంలో ఇజ్రాయెల్ మంత్రి సస్పెన్షన్..

nuking Gaza comment: యుద్ధం టైంలో ఇజ్రాయెల్ మంత్రి  సస్పెన్షన్..

న్యూకింగ్ గాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ మంత్రి ఎలియాహును  ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు సస్పెండ్ చేశారు. తన కేబినెట్ లోని ఓ సభ్యుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు నెతన్యాహు. హమాస్ మిలిటెంట్లతో పాలస్తీనా పౌరులు నష్టాన్ని  చవిచూస్తున్న గాజాపై అణుదాడి చేయాలన్న ఆలోచనను వెల్లడించిన మంత్రిని కేబినెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటననలో తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలోని తీవ్ర వాద పార్టీకి చెందిన హెరిటేజ్ మంత్రి అమిహయ్ ఎలియాహును తదుపరి నోటీసు వచ్చే వరకు కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉంచారు. ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలియాహు అణు దాడి గురించి మాట్లాడుతూ అది ఒక మార్గం అని వ్యాఖ్యానించారు. ఇది అరబ్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇది ఇజ్రాయిలీ ప్రధాన మీడియాను అపకిర్తీ పాలు చేసింది.