నిర్మల్ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : నంది రామయ్య

నిర్మల్ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : నంది రామయ్య

ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం ఎల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు పలు డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని అందజేశారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నాని తెలిపారు.

గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలని కోరారు. వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ పథకం కింద రూ.10 లక్షలు కేటాయించి వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేయించి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని విన్నవించారు.