లక్సెట్టిపేట మండలం హనుమంత్పల్లిలో..వేడుకగా పోచమ్మ బోనాలు

లక్సెట్టిపేట మండలం హనుమంత్పల్లిలో..వేడుకగా పోచమ్మ బోనాలు

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మండలం హనుమంత్​పల్లిలో గురువారం పోచమ్మ బోనాలు పెద్ద ఎత్తున జరిగాయి. గ్రామంలోని మహిళలు బోనాలతో పోచమ్మ దేవాలయం వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి బోనంతో పాటు ఒడిబియ్యం సమర్పించారు. గ్రామం పాడి పంటలు, సుఖశాంతులతో వెళ్లివిరియాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పోచమ్మకు బోనాలు సమర్పించుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు.

తిర్యాణిలో ఆషాఢ బోనాలు 

తిర్యాణి, వెలుగు: తిర్యాణితోపాటు మండలంలోని చింతపల్లి, భీమారం తదితర గ్రామాల్లో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు కులదైవం పోచమ్మకు బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక నైవేద్యం సమ ర్పించి ఆరాధించారు.