పంజాగుట్ట, వెలుగు: పదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. పంజాగుట్ట విజయనగర్ కాలనీలో నివసించే సయ్యద్ అల్తాఫుద్దీన్(37) ఎర్రమంజిల్‌లోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
ప్రైవేట్‌గా జిమ్ కూడా నిర్వహిస్తున్నాడు. ఈ నెల 4న పదో తరగతి విద్యార్థినులు తరగతులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, మాస్క్ వేసుకుని వారిని అడ్డగించాడు. వారిని ఫాలో అవుతూ అసభ్యంగా వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. బాలికలు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
