నవాబుపేట, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక పోక్సో, అత్యాచార కేసుల న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. బాలానగర్ మండలం మోతిఘన్‌పూర్ గ్రామానికి చెందిన పసుపుల నందు (29)పై నమోదైన కేసులో విచారణ పూర్తికాగా, కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.
జడ్జి తమన్ రాజరాజేశ్వరి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్, సీఐ గాంధీనాయక్, అప్పటి ఎస్సై విక్రం తదితరులను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించారు
