పోలండ్‌లోకి రష్యా క్షిపణులు... ఇద్దరు మృతి

పోలండ్‌లోకి  రష్యా క్షిపణులు... ఇద్దరు మృతి

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూ.. రష్యా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింది. తూర్పు పోలండ్ లోని ప్రజెవోడో లో జరిగిన క్షిపణుల దాడిలో ఇద్దరు మరణించినట్లు పోలండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు. 

పోలండ్ భూభాగంలో రష్యా మిస్సైల్ తాకినట్లు వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ చర్యలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడమే అని అభివర్ణించింది. ఉక్రెయిన్ -పోలండ్ సరిహద్దుకు సమీపంలో లక్ష్యంగా చేసుకుని రష్యా ఎటువంటి దాడులకు పాల్పడలేదని ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. అయితే క్షిపణిని ఎవరు ప్రయోగించారనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని పోలండ్ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ దుడా అన్నారు, ఇది బహుశా రష్యాలో తయారు చేయబడిందని చెప్పారు. క్షిపణిని ఎవరు ప్రయోగించారనేదానికి ప్రస్తుతానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.