మాజీ భర్త మర్డర్ ప్లాన్ : అరెస్ట్ చేసిన పోలీసులు

మాజీ భర్త మర్డర్ ప్లాన్ : అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్  రాజేంద్రనగర్ లో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. విడాకులు తీసుకున్న భార్యపై కత్తితో దాడిచేసేందుకు ప్రయత్నించాడు. ముందే పసిగట్టిన మహిళ 100కు డయల్ చేయటంతో పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.

బోరబండలో నివాసముంటున్న సాయికిరణ్, లావణ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. సంసారంలో గొడవలు రావటంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి లావణ్య రాజేంద్రనగర్ బండ్లగూడలో పిల్లలతో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తోంది. లావణ్యపై కోపం పెంచుకున్న సాయికిరణ్.. ఎలాగైనా మట్టుపెట్టాలని లావణ్య ఉండే  కాలనీలో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన లావణ్య 100 నెంబర్ ఫోన్ చేసి విషయం చెప్పడంతో.. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వెంట తెచ్చుకున్న పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సాయికిరణ్  అప్పటికే కూల్ డ్రింక్ సీసాలో మద్యం కలుపుకొని తాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.