పబ్ కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు

పబ్ కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు

బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కేసులో నిందితులుగా ఉన్న అనిల్, అభిషేక్ కాల్ లిస్ట్ లో సంజయ్, సోమా శశికాంత్ ఉండడంతో వారిని ప్రశ్నిస్తున్నారు. పంజాగుట్ట టోని కేసులో గుర్తించిన 19 మంది డ్రగ్స్ వినియోగదారుల లిస్ట్ లోనూ సంజయ్, శశికాంత్ ఉన్నారు. వీరికి గతంలోనూ నోటీసులు ఇచ్చారు. ఇవాళ సంజయ్, శశికాంత్ నేరుగా పీఎస్ లోనే విచారణకు హాజరయ్యారు. పబ్ కేసులో నిందితులు అభిషేక్, అనిల్ తో ఉన్న సంబంధాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు చెప్పనుంది నాంపల్లి కోర్టు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియగా.. బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు పోలీసుల తరఫు న్యాయవాది. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని నిందితుల తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కేసులో పబ్ ఓనర్ అభిషేక్, మేనేజర్ అనిల్ నిందితులుగా ఉన్నారు. నాలుగు రోజుల పాటు నిందితులను ప్రశ్నించారు బంజారాహిల్స్ పోలీసులు. ఈనెల 3న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు జరిపిన దాడుల్లో పబ్ లో డ్రగ్స్ దొరికాయి. పబ్ మేనేజర్ అనిల్, పబ్ ఓనర్ అభిషేక్ పై NDPS యాక్టు కింద కేసు నమోదు చేశారు.