హైదరాబాద్లో నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్

హైదరాబాద్లో నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓల్డ్ సిటిలో ఒక ఇంటిపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి.. 27 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోగా.. వారిలో రామేశ్వరి అనే మహిళ కూడా ఉంది. పోలీసులు నిందితుల నుంచి నకిలీ కరెన్సీ తయారీకి ఉపయోగించిన లాప్ టాప్, లామినేటర్ ప్రింటర్, పేపర్, కలర్ బాక్స్ లు స్వాధీనం చేసుకున్నారు.  

ఫేక్ కరెన్సీ తయారీలో ప్రధాన నిందితుడైన రమేష్ బాబు అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు డీసీపీ శబరీష్ చెప్పారు. అతను గుజరాత్ లోనూ ఫేక్ కరెన్సీ సర్క్యూలేట్ చేసినట్లు గుర్తించామని అన్నారు. నకలీ నోట్ల కేసులోనే రమేష్ బాబును గతంలో గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నిందితులపై పలు పీఎస్ లలో కేసులు ఉన్నాయి. నిందితులు యూట్యూబ్ ద్వారా దొంగ నోట్ల తయారీని నేర్చుకున్నారు. రమేష్ బాబును కస్టడిలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని డీసీపీ వెల్లడించారు.