కేటీఆర్ టూర్.. పోలీసుల అదుపులో మిడ్ మానేరు నిర్వాసితులు

కేటీఆర్ టూర్.. పోలీసుల అదుపులో మిడ్ మానేరు నిర్వాసితులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో  మిడ్ మానేరు  నిర్వాసితులను   పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ  మధ్యాహ్నం మంత్రి  కేటీఆర్ వేములవాడ  పర్యటన ఉండటంతో  అడ్డుకుంటారని  ముందస్తుగా అరెస్ట్ చేశారు.  నిర్వాసితులను వేములవాడ టౌన్, కొనరావుపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొన్ని రోజులు  తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు పోరాటం చేస్తున్నారు. వేములవాడ టౌన్ లో  నిర్వహించే  తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలకు కేటీఆర్ హాజరుకానున్నారు.