ఇంటర్ బోర్డు ఎదుట వామపక్ష నేతల ఆందోళన

ఇంటర్ బోర్డు ఎదుట వామపక్ష నేతల ఆందోళన

అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇంటర్ విద్యార్ధులుకు జరిగిన అన్యాయంపై గత కొన్ని రోజులుగా తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా బోర్డు ఎదుట సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో అవకతవకలపై నిరసనగా సీపీఎం కార్యకర్తలు ధర్నా చేశారు.  17 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. నేతల ఆందోళనలతో బోర్డు దగ్గర మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ నిరసన తెలుపుతున్న సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్‌ చేపట్టిన చర్యలు కంటి తుడుపుగా ఉన్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు.