జకీర్ నాయక్ పబ్లిక్ స్పీచ్ లు బ్యాన్

జకీర్ నాయక్ పబ్లిక్ స్పీచ్ లు బ్యాన్

కౌలాలంపూర్:  వివాదాస్పద మత బోధకుడు జకీర్​నాయక్​ పబ్లిక్​స్పీచ్​లను మలేషియా పోలీసులు బ్యాన్ చేశారు. దేశంలోని ఏ ప్రాంతంలోనూ స్పీచ్​లు ఇవ్వొద్దంటూ వార్నింగ్​ఇచ్చారు. ఆయన స్పీచ్​లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో, నేషనల్​సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా పోలీస్​బాస్​దాతుక్​అస్మావతి అహ్మద్​చెప్పారు. ఈమధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జకీర్​దేశంలోని పలు వర్గాలను రెచ్చగొట్టే కామెంట్స్​చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మలేషియాలోని హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం జకీర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దాదాపు 10 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఆ తర్వాత ఇకపై స్పీచ్​లు ఇవ్వొద్దని జకీర్​కు వార్నింగ్​ఇచ్చారు. ఈ వ్యవహారంపై మలేషియా ప్రధాని డాక్టర్​మహతిర్​మొహమ్మద్​స్పందించారు. జకీర్​తన పరిమితులు దాటి రెసిడెన్సీ హోదాను సంశయంలో పడేసుకున్నారని కామెంట్​చేశారు. ఇండియాలో టెర్రర్​కార్యకలాపాలకు జకీర్​ఆర్థిక సాయం అందించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఎన్ఐఏ కేసు ఫైల్​చేయడంతో మలేషియా పారిపోయి ఆశ్రయం పొందాడు. కేంద్ర ప్రభుత్వం జకీర్​పాస్​పోర్టును రద్దుచేసి, ఆయన ఆస్తులను జఫ్తు చేసింది. జకీర్​ను తమకు అప్పగించాలంటూ మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. పర్మినెంట్​రెసిడెన్సీ పొందిన జకీర్​పై ఎలాంటి నేరారోపణలు లేకపోవడంతో అప్పగించలేమని మలేషియా పేర్కొంది. తాజా ఫిర్యాదుల నేపథ్యంలో జకీర్​రెసిడెన్సీ హోదాను కేన్సిల్​చేసి, ఆయనను ఇండియాకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.