
నాగర్ కర్నూలు జిల్లా : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అమ్రాబాద్ యురేనియం యాత్రను అడ్డుకున్నారు పోలీసులు. అమ్రాబాద్ యాత్రకు అనుమతిచ్చేది లేదన్నారు. హైదరాబాద్ నుండి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ వెళుతున్న కోదండరామ్ కారును వెళ్దొండ దగ్గర అడ్డుకున్నారు. “అభయారణ్యంలో పులులు ఉంటాయి, అవి భయపడుతాయి, అందుకే మిమ్ములను అమ్రాబాద్ కు పంపడం లేదు” అని పోలీసులు సమాధానమిచ్చారు
అమ్రాబాద్ అడవుల్లో యురేనియం తవ్వకాలపై స్థానికంగా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమం ఉధృతం చేస్తున్నాయి. సమస్యను తెలుసుకుని, స్థానికుల డిమాండ్ కు మద్దతిచ్చేందుకు అమ్రాబాద్ యురేనియం యాత్రకు బయల్దేరారు కోదండరాం. మధ్యలో వెళ్దొండ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు.