
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. మంగళవారం ( అక్టోబర్ 14 ) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. STFD టీం, సీఐ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 1.6 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రైల్వేస్టేషన్ లోని 10వ ప్లాట్ ఫామ్ పై అనుమానాస్పద సంచిలో గంజాయి చాక్లెట్లను గుర్తించారు పోలీసులు.
తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ప్లాట్ ఫామ్ పై ఉన్న సంచిని తెరిచి చూడగా గంజాయి చాక్లెట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.
అయితే.. గంజాయి తరలిస్తున్న కారులో మంటలు రావడంతో కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు నిందితులు. మంగళవారం ( అక్టోబర్ 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర జరిగింది ఈ ఘటన. గంజాయి తరలిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడిరోడ్డుపై కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు గుమిగూడారు. దీంతో భయపడ్డ నిందితులు కారు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.