పాలిథీన్ కవర్ తీసిన కుక్కలు.. బయట పడిన శవం.. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన

పాలిథీన్ కవర్ తీసిన కుక్కలు.. బయట పడిన శవం.. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన

నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో లక్ష్మణ్ అనే వ్యక్తి హత్య కలకలం రేపింది. గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో లక్ష్మణ్  శవాన్ని సంచిలో మూట కట్టి గుర్తు తెలియని వ్యక్తులు భూమిలో పాతిపెట్టారు. కుక్కలు పాలిథీన్ కవర్ తీయడంతో శవం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వన్నేవాడ్ లక్ష్మణ్ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం లక్ష్మణ్ కనిపించకుండాపోయాడు. అతని కుటుంబం ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేశారు. రెండు నెలల తర్వాత లక్ష్మణ్ ఎముకల గూడు కనిపించడంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. లక్ష్మణ్ ను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్థారించారు.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో కూడా నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని మృతదేహం లభించింది. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం.. పెద్దనపల్లి గ్రామ పంచాయతీలోని నాయకపుగూడ సుద్దవాగు ఒడ్డున ఓ వ్యక్తి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పంచాయతీ సెక్రటరీ క్రాంతి కుమార్కు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల వయసులో ఉన్న పురుషుడి కుళ్లిపోయిన డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి ఒంటిపై నీలం రంగు డబ్బాల పుల్ షర్ట్, కుండి చేతికి కడియాలు ఉన్నాయన్నారు. దాదాపు 5 రోజుల క్రితం నీళ్లలో పడి చనిపోయి ఉంటాడని ఎస్సై తెలిపారు.