థియేటర్లో జాతీయగీతం వివాదం.. ఆహుతి ప్రసాద్ కొడుకుపై కేసు

థియేటర్లో జాతీయగీతం వివాదం.. ఆహుతి ప్రసాద్ కొడుకుపై కేసు
  • థియేటర్లో జనగణమన గీతానికి లేచి నిలబడని ఆహుతి ప్రసాద్ కొడుకు
  • మందలించిన ప్రేక్షకులు
  • అడిగినందుకు దూషించాడని కేసు పెట్టిన బాధిత ప్రేక్షకులు

దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ కొడుకు కార్తీక్ పై పోలీస్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ లోని RK సినీప్లెక్స్ లో జాతీయ గీతం వచ్చినపుడు కార్తిక్ లేచి నిలబడలేదు. సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కార్తీక్ ను ప్రశ్నించారు. లేచి నిలబడాలని అడిగారు. కోపానికొచ్చిన కార్తిక్ తనను ప్రశ్నించిన వారిని బూతులు తిట్టాడు. జాతీయ గీతం అవమానించడమే కాకుండా.. ప్రశ్నించిన తమను దూషించాడని కార్తీక్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు బాధిత ప్రేక్షకులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..  దర్యాప్తు చేస్తున్నారు.