
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మంగళవారం నుంచి పోలింగ్ ముగిసే దాకా పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండాపోలీసు కమిషనర్లు ముం దస్తు చర్యలు తీసుకున్నా రు. మంగళవారం సా యంత్రం 6 గంటల నుం చిగురువారం సా యంత్రం దాకా మద్యం షాపులుమూసేయాలని, మైకులతో ప్రచారం చే యొద్దనిఆదేశాలు జారీ చేశా రు. గ్రేటర్ హైదరాబాద్ లోనివైన్ షాపులు, బార్లు, రెస్టా రెంట్ లు , స్టార్ హోటళ్లు నిర్వహించే బార్లు, మిలటరీ క ్యాంటీన్లలో మద్యం అమ్మకాలు, రిజిస్టర్ క్లబ్‌లు , కల్లు దుకాణాలుబంద్ చే యాలని పేర్కొన్నా రు. పోలింగ్ జరిగే11వ తేదీన అన్ని పోలింగ్ కేం ద్రాల వద్ద 144సెక్షన్ ఉంటుందన్నా రు. పోలింగ్ స్టేషన్ కు 200మీటర్ల దూరంలో ఐదుగురు కానీ అంతకంటే ఎక్కు వ మంది ఉండొద్దని ఉత్తర్వు లు జారీచేశా రు. నిబంధనలు ఉల్లం ఘించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని సీపీ అంజనీకుమార్హెచ్చరించారు. అభ్యర్థులు, కార్యకర్తలపై పోలీస్నిఘా కొ నసాగుతుందని చెప్పారు.