ఆసిఫాబాద్లో పోలీసుల తనిఖీలు

ఆసిఫాబాద్లో పోలీసుల తనిఖీలు
  • ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో..

ఆసిఫాబాద్, వెలుగు: ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆసిఫాబాద్​ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్​తో కలెక్టరేట్, కోర్టు, బస్టాండ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.