పేకాట రాయుళ్లపై పోలీస్ పంజా.. 9 మంది అరెస్ట్

పేకాట రాయుళ్లపై పోలీస్ పంజా.. 9 మంది అరెస్ట్

పేకాట రాయుళ్ల స్థావరాలపై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 9 మంది నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలోని ఓఅపార్ట్ మెంట్ లో అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమచారాం రావడంతో ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్ లో పేకాటట ఆడుతున్న 9 మందిని రెడ్ హ్యండెడ్ గా  పట్టుకున్నారు.

 నిందితుల నుంచి రూ. 2.71 లక్షల రూపాయల నగదు, 9 సెల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు ముద్దాల వెంకట కృష్ణారావుతో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.