- బలగాల రాకను గమనించి పారిపోయిన మావోయిస్టులు
- మావోల సామగ్రి స్వాధీనం
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శుక్రవారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ బలగాలను చూసి మావోయిస్టులు పారిపోయారు. జిల్లాలోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని తేటెమడుగు-పటేల్, పారా గ్రామాల మధ్య మావోయిస్టులు సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్ పోలీసులు కూంబింగ్‌కు బయలుదేరారు. బలగాల రాకను దూరం నుంచే గమనించిన మావోయిస్టులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.
మావోలు సమావేశమైన స్థలం నుంచి ప్రెషర్ బాంబులు, స్కానర్ సెట్, మూడు బ్యాటరీలు, నాలుగు జతల యూనిఫాం, 500 గ్రాముల గన్‌పౌడర్, రెండు చిన్న బ్యాటరీలు, వైరు, తుపాకీ, విప్లవసాహిత్యంతో పాటు నిత్యావసర సరుకులను పోలీసులు స్వాధీనం చేసుకొని కిష్టారం స్టేషన్‌కు తరలించారు. మావోయిస్టుల ఆచూకీ కోసం అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
