
కాజీపేట, వెలుగు: కాజీపేట పీఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమాతో కలిసి పీఎస్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పోలీసు కిట్స్ ను తనిఖీ చేశారు. రిసెప్షన్, సీసీటీఎన్ఎస్ విభాగాల పనితీరు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సీపీకి కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి పలు వివరాలు తెలిపారు. సీపీ వెంట కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎస్సైలు నవీన్ కుమార్, లవన్‌కుమార్, శివకుమార్ ఉన్నారు. అనంతరం సీపీ కాజీపేట ట్రాఫిక్పీఎస్ను తనిఖీ చేసి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.