చిన్న బెల్లాల్​లో కార్డన్​ సెర్చ్

చిన్న బెల్లాల్​లో కార్డన్​ సెర్చ్

కడెం, వెలుగు : కడెం మండలం చిన్న బెల్లాల్​లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలోని అన్ని ఇండ్లలో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని 90 బైక్​లు, 2 కార్లు, 3 ఆటోలు, ఒక ఐచర్, ఓ ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ సీఐ సైదారావు మాట్లాడుతూ.. రాత్రి 10 దాటిన తర్వాత యువకులెవరూ రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు.

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటివల్ల చోరీలు, నేరాలు అదుపులో ఉంటాయని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎస్​ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.