వివాహేతర సంబంధమే కారణం: పంచాయతీ కార్యదర్శి హత్య కేసును చేధించిన పోలీసులు

వివాహేతర సంబంధమే కారణం: పంచాయతీ కార్యదర్శి హత్య కేసును చేధించిన పోలీసులు

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న కోడప్గల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణ జూన్ 5న అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్‏గా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే చేధించారు. పంచాయతీ కార్యదర్శి కృష్ణ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం (జూన్ 11) మీడియాకు వెల్లడించారు. జూన్ 5న హత్యకు గురైన కృష్ణ డెడ్ బాడీని జూన్ 7వ తేదీన గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. కృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్నారు. హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‏కి తరలించినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి కత్తి, గొడ్డలి, ఇనుపరాడ్డు, రెండు రొకళ్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.