తిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హాల్ చల్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‎లో 300 దాటిన మీటర్

తిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హాల్ చల్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‎లో 300 దాటిన మీటర్

తిరుమల: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సామాన్య ప్రజలను పట్టుకునే పోలీసులే మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ ఘటన కలియుగ దైవం శ్రీవారి సన్నిధి తిరుమలలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం (మే 23) తిరుమలలో ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో నానా హంగామా సృష్టించారు. కర్నూల్‎కి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం సేవించి తిరుమలకు వచ్చారు. తిరుమల ఘాట్ రోడ్డులో ర్యా్ష్ డ్రైవింగ్ చేస్తూ పలు వాహనాలను ఢీకొట్టారు. 

అనంతరం రోడ్డుపైన కానిస్టేబుళ్లు నానా హంగామా చేశారు. దీంతో భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న తిరుమల పోలీసులు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు. కానిస్టేబుళ్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయగా.. మీటర్ 300 పాయింట్లు దాటడంతో పోలీసులు అవాక్కయ్యారు. 

పీకల దాకా మద్యం తాగి రాష్ డ్రైవింగ్ చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను కర్నూలుకు చెందిన రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాజుద్దీన్ గుర్తించారు. ఇందులో ఓ కానిస్టేబుల్ పరారీలో ఉన్నట్లు సమాచారాం. మద్యం మత్తులో కానిస్టేబుళ్ల వీరంగం సృష్టించడం.. అది కూడా తిరుమలలో కావడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనను సీరియస్‎గా తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. సదరు కానిస్టేబుళ్లను పోలీసులు విచారిస్తున్నారు.