రోడ్డుపై బైఠాయించి ప్రియాంకా గాంధీ నిర‌స‌న 

రోడ్డుపై బైఠాయించి ప్రియాంకా గాంధీ నిర‌స‌న 
  • ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు 
  • నల్లదుస్తులతో సోనియా, రాహుల్ ఆందోళనలు.. ​రోడ్డుపై బైఠాయించి ప్రియాంకా గాంధీ నిర‌స‌న 
  • పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ, శశిథరూర్ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు
  • ప్రజాసమస్యల కోసం పోరాడుతున్న ఎంపీలతో..అనుచితంగా ప్రవర్తించారని రాహుల్ ఆగ్రహం 
  •  ఉద్రిక్తంగా  మారిన  కాంగ్రెస్ ఆందోళనలు

న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, నిరుద్యోగం పై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, శశిథరూర్ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ కి ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నించారు. అనుమతి లేని కారణంగా పోలీసుల నిరాకరణతో .. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్డుపై బఠాయించి ఆందోళన తెలిపారు. వెంటనే నిత్యాసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలీసుల మాట వినకపోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ప్రజాసమస్యల కోసం పోరాడుతున్న ఎంపీలతో అనుచితంగా ప్రవర్తించారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెరిగిన ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ నిరసనలు చేపట్టారు. ప్రధాని ఇంటి ముట్టడి కార్యక్రమంలో CWC మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ మినహా ఇతర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర బారికేడ్లతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఏఐసీసీ ఆఫీసు దగ్గర కేంద్ర పారామిలటరీ బలగాలు మోహరించాయి. అంతకు ముందు పార్లమెంటులో బ్లాక్ డ్రెస్సులు వేసుకుని నిరసన తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. నిరసనలో కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరల పెంపుపై చర్చించాలని డిమాండ్ చేశారు.