
ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, బైక్ మీద ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు బండ్లు నడిపేవాళ్లను కంట్రోల్లో పెట్టేందుకు కర్నాటక పోలీసులు ఓ కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నారు. అచ్చం ట్రాఫిక్ పోలీసుల్లాగే.. యూనిఫాం వేసిన బొమ్మలను చిన్న చిన్న ట్రాఫిక్ పాయింట్ల దగ్గర పెట్టారు. ఈ బొమ్మ ట్రాఫిక్ పోలీసును చూసి సిగ్నల్ జంప్ చేసేందుకు స్పీడ్ పెంచేవాళ్లు కూడా కంట్రోల్ అవుతారని వారు చెప్పారు.
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గడిచిన రెండ్రోజుల్లో దాదాపు అర డజనుకు పైగా బొమ్మ పోలీసులను బెంగళూరులోని పలు సిగ్నల్ పాయింట్లలో నిలబెట్టామని నగర అడిషనల్ కమిషనర్(ట్రాఫిక్) రవికాంత్ చెప్పారు. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోనివాళ్లు.. ఫోన్లో మాట్లాడుతూ బండ్లు నడిపేవాళ్లు దూరం నుంచి వాటిని చూసి ఎలర్ట్ అవ్వడం తాను గమనించానని, అందుకే బొమ్మలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.
– బెంగళూరు