తాగి బండి నడిపేటోళ్లపై పోలీసుల ఫోకస్

తాగి బండి నడిపేటోళ్లపై పోలీసుల ఫోకస్
  • గ్రేటర్ లో వెయ్యి మందికి కౌన్సిలింగ్
  • కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహణ

హైదరాబాద్,వెలుగు: సిటీలో డ్రంకెన్ డ్రైవ్ ​చేసేటోళ్లకు చెక్‌‌ పెట్టేందుకు పోలీసులు ఫోకస్​పెట్టారు. కరోనాతో కొంతకాలంగా బంద్​పెట్టినా మళ్లీ  డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్స్‌‌పై చెకింగ్​లు చేస్తున్నారు. తాగి డ్రైవ్‌‌ చేసే వారిలో మార్పు తెచ్చేలా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్‌‌ సెషన్స్‌‌లో భాగంగా యాక్సిడెంట్లపై షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తున్నారు. సెకండ్‌‌ టైమ్ పట్టుబడ్డ వారిని స్పెషల్‌‌గా ట్రీట్‌‌ చేస్తున్నారు. ఫస్ట్‌‌ కౌన్సిలింగ్‌‌, కోర్టు కేసుల డేటా ఆధారంగా సీరియస్‌‌ యాక్షన్ తీసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో ప్రతి రోజూ సుమారు వెయ్యి మందికి కౌన్సిలింగ్ చేస్తున్నారు.

లైవ్​ వీడియోస్​ చూపిస్తూ..  
షార్ట్‌‌ ఫిల్మ్స్‌‌ తో పాటు యాక్సిడెంట్స్ లైవ్ వీడియోస్‌‌, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు, కుటుంబాల ఆవేదనను డిజిటల్ స్క్రీన్ పై ప్లే చేస్తున్నారు.  ఈ ఏడాది జరిగిన మేజర్ డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్స్‌‌ను చూపిస్తున్నారు. తాగి  డ్రైవ్ చేసే వారి బ్రెయిన్, నరాలు, మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో  కేస్‌‌ స్టడీస్ ద్వారా డాక్టర్లతో వివరిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌‌ లో పట్టుబడ్డ వారికి బ్యాచ్​లర్​ అయితే పేరెంట్స్‌‌ , పెళ్లయి ఉంటే భార్యను తీసుకురావాలనే కండీషన్‌‌  పెడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్​సమక్షంలోనే కౌన్సిలింగ్ చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్​తో జర్నీ చేసే  సమయంలో కారులో కూర్చున్న వారు కూడా బాధ్యులవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాగి డ్రైవ్ చేస్తున్న విషయం తెలిసి కూడా అడ్డుకోకుండా వారితో కలిసి ట్రావెల్ చేసే వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. కేసుల తీవ్రత, జాబ్​ల సమయాల్లో తలెత్తే సమస్యలను వివరిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌‌లో సుమారు 40 నుంచి50 మందికి కౌన్సిలింగ్‌‌కి ఇస్తున్నారు. సుమారు గంటకు తగ్గకుండా డ్రంకెన్ డ్రైవింగ్ యాక్సిడెంట్స్‌‌పై అవేర్​నెస్ కల్పిస్తున్నారు.

పోలీసులకు పట్టుబడ్డాకే  తెలిసింది..
మా అబ్బాయి  బీటెక్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్‌‌తో బయటకు వెళ్లి తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. అప్పటి వరకు మా అబ్బాయి తాగుతాడని తెలియదు. పోలీస్ కౌన్సిలింగ్‌‌ టైమ్ లో ఈ విషయం తెలిసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తీరు బాగుంది. రోడ్ యాక్సిడెంట్స్ కంటే డ్రంకెన్ డ్రైవ్​ఘటనలను తీవ్రమైన నేరంగా చూడాలి. బార్లు, వైన్స్ దగ్గరలో కూడా తనిఖీలు చేయాలి- రాజేశ్ కుమార్‌‌‌‌, పేరెంట్,​ బాగ్‌‌లింగంపల్లి 

98 శాతం మందిలో మార్పు
డ్రంకెన్​ డ్రైవ్​లో పట్టుబడిన వారు కౌన్సిలింగ్​లో భాగంగా అవేర్​నెస్ షార్ట్​ఫిల్మ్‌‌  తప్పనిసరిగా చూడాల్సిందే.  సీసీ ఫుటేజ్ లతో పాటు డ్రంకెన్ డ్రైవర్లు చేసిన యాక్సిడెంట్లపై వీడియోలను చూపిస్తాం. గోషా మహల్‌‌, బేగంపేట్‌‌ సెంటర్లలో  డైలీ సుమారు 400 మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కౌన్సిలింగ్‌‌ కు అటెండ్​అయిన వారిలో 98 శాతం మందిలో మార్పు కనిపిస్తోంది. కేవలం 2 శాతం మంది మాత్రమే రెండోసారి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడుతున్నారు- హరీశ్, ఇన్‌‌స్పెక్టర్‌‌, టీటీఐ, హైదరాబాద్‌‌

పేరెంట్స్ కూడా బాధ్యతగా ఉండాలె
పోలీసుల కౌన్సిలింగ్‌‌ మంచి రిజల్ట్‌‌ ఇస్తోంది. పిల్లలు ఎక్కడికెళ్తున్నారు.. ఫ్రెండ్స్‌‌ షిప్ ఎలాంటిదో మేము కూడా గమనిస్తున్నాం. న్యూస్‌‌ చానెళ్లలో డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్ల గురించి చూసినప్పుడు అయ్యోపాపం అనుకునే వాళ్లం. మా పిల్లలు కూడా తాగి డ్రైవ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఆందోళన చెందాం. పిల్లలను కట్టడి చేయడం పేరెంట్స్ బాధ్యతే- మనీషా, పేరెంట్​, అమీర్‌‌‌‌పేట్‌‌ 

‘‘ ఐదు రోజుల కిందట డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్​లో మహేశ్ కు టెస్ట్​చేయగా 150 బీఏసీ లెవెల్ ​వచ్చింది. కౌన్సిలింగ్​కు పేరెంట్స్‌‌ను తీసుకురావాలని అతడికి పోలీసులు సూచించారు. ప్రభుత్వ అధికారి అయిన తండ్రితో కలిసి మహేశ్ కౌన్సిలింగ్‌‌కి అటెండ్‌‌ అయ్యాడు.  యాక్సిడెంట్లపై షార్ట్‌‌ ఫిల్మ్స్‌‌ చూపించి, సీసీ టీవీల ఫుటేజ్‌‌ లతో కౌన్సిలింగ్‌‌ ఇవ్వడంపై మహేశ్ తండ్రి పోలీసులను అభినందించాడు.’’