పోలీసుల సూపర్ ప్లాన్ : అరటిపండ్లు తినిపించి దొంగలను పట్టుకున్నారు

పోలీసుల సూపర్ ప్లాన్ : అరటిపండ్లు తినిపించి దొంగలను పట్టుకున్నారు

జైపూర్: దొంగల చేత నిజం ఒప్పించడానికి పోలీసులు సూపర్ ఐడియాను ఉపయోగించారు. దొంగతనం చేసిన ఇద్దరు అనుమానుతులచే అరటిపండ్లు తినిపించి నిజాన్ని రాబట్టారు. ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది. వివరాలు..బికనీర్‌ లోని గంగాషెహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చైన్ స్నాచింగ్ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తన మెడలో ఉన్న బాంగారు గొలుసు లాక్కొని పారిపోయారంటూ ఓ మహిళ మంగళవారం ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించారు. దాని ఆధారంగా దొంగలు ఎక్కడ ఉంటున్నదీ తెలుసుకున్నారు.

అదే రోజు ఆ దొంగలు నివసిస్తున్న ఇంటిపై రైడ్ చేశారు. సడెన్ గా పోలీసులు రావడంతో  ఆ ఇద్దరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతలో వారిలో ఒకడు గోల్డ్ చైన్ మింగేశాడు. చైన్ మింగేసి ఉంటాడని అనుమానం వచ్చిన పోలీసులు..ఓ చక్కటి ప్లాన్ వేశారు. అతడి చేత డజనుకు పైగా అరటి పళ్లు, రెండు బొప్పాయి పళ్లు తినిపించారు. ఆ రోజంతా ఆ ఇంట్లోనే ఉన్నారు. అంతే, నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూమ్‌ లో ఆ గొలుసు బయటపడింది. కిలాడీ దొంగలను రిమాండ్‌ కు తరలించిన పోలీసులు, గొలుసును మహిళకు తిరిగిచ్చేశారు. సింపుల్ ప్లాన్ తో దొంగలను పట్టుకున్న ఆ పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు