ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్

ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్

మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బయ్యారం కొత్తగూడ, గంగారాం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి..తనిఖీలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో వాహనాలను విసృత్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. 

ఏజెన్సీ ప్రాంతాల్లోని మాజీ మావోయిస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. భద్రతా బలగాల తనిఖీలతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.