సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసుల తనిఖీలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పెద్ద సంఖ్యలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తులో ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో గేట్ నెంబర్ 3 నుండి మాత్రమే ప్రయాణికుల ఎంట్రీ బోర్డు పెట్టారు. గేట్ నెంబర్ 4 వద్ద నో ఎంట్రీ బోర్డు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 5ను పూర్తిగా మూసి వేశారు. 

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఎగ్జామ్ ఫలితాలు ఆలస్యమవుతున్న క్రమంలో ప్రత్యేక ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చింది. మరోవైపు ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న అలర్ల దృష్ట్యా కూడా బందోబస్తు మరింత పెంచారు. మొత్తంగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీ బందోబస్తు కనిపిస్తోంది. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానిత వస్తువులు, బ్యాగులను తనిఖీలు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు.