న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడి ఫొటో రిలీజ్

న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడి ఫొటో రిలీజ్

అమెరికా న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఫొటో ను పోలీసులు రీలీజ్ చేశారు.బ్రూక్లిన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కాల్పులు జరగడంతో.. 23 మందికి గాయాలయ్యాయి. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి అధికారులు 50 వేల డాలర్ల నజరానా ప్రకటించారు.62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్ ను ఈ కేసులో పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా గుర్తించారు. నిందితుడు వాడినట్లు భావిస్తున్న యూ హౌల్ వ్యాన్ కీస్ ని స్వాధీనం చేసుకున్నారు. మెట్రో స్టేషన్ లో స్మోక్ బాంబ్ విసిరే ముందు గ్యాస్ మాస్క్ ధరించి... కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడిలో 10 మందికి బుల్లెట్ గాయాలు కాగా... 13 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు. కాల్పులకు వాడిన గ్లాక్ హ్యాండ్ గన్, రెండు పేలని స్మోక్ గ్రానేడ్లు, 3గన్ మ్యాగ్జైన్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన వారికి సాయం చేసిన తోటి వారికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

మహిళల భద్రత కోసం కర్ణాటకలో నెలంతా సేఫ్టీ రైడ్

జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్‌‌ క్యాన్సర్‌‌‌‌!