తనిఖీల్లో పట్టుకున్న డబ్బు కొట్టేసిన పోలీస్.. బాధితుడి కంప్లయింట్ తో సస్పెండ్

తనిఖీల్లో పట్టుకున్న డబ్బు కొట్టేసిన పోలీస్.. బాధితుడి కంప్లయింట్ తో సస్పెండ్

అన్యాయాన్ని అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులకు కక్కుర్తి పడి తమ స్థాయి హోదాను మరిచి లంచం తీసుకుంటున్నారు. హవాలా రూపంలో తరలిస్తున్న డబ్బును పట్టుకుని నిందితుడిని బెదిరించి అతని వద్ద దొరికిన దాంట్లో నుంచి రూ. 50 లక్షలు తీసుకుని బెదిరింపులకు గురి చేసి హెచ్చరించి పంపిచాడు ఓ పోలీస్ అధికారు. ఏ తప్పు చేసిన ఎన్ని రోజులు దాగదన్నట్టు అధికారి చేసిన తప్పు కూడా వెంటనే బయటపడింది. విషయం ఉన్న తాధికారులకు తెలిసి సస్పెన్షన్ దాకా వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని  గోరఖ్‌పూర్‌లోని బెనిగంజ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తున్న సింగ్ చేతివాటం చూపించాడు. ఓ వాహనంలో రూ.85 లక్షలు అక్రమంగా తరలిస్తున్నారని పక్కా సమాచారం పీఎస్ కు వచ్చింది. సమాచారాన్ని అందుకున్న సింగ్ తన తోటి వారిని తీసుకెళ్లకుండా ఒక్కరే వెళ్లి నౌతాన్వా (నేపాల్ సరిహద్దు) వద్ద చెక్ పోస్ట్ పెట్టారు. అటుగా వచ్చిన కారును ఆపి చేక్ చేశాడు. 

కారులో ఉన్న ఓ వ్యాపారి వద్ద రూ. 85 లక్షలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే కారులోని డ్రైవర్ ను బెదిరించి అక్కడి నుంచి పంపించాడు. వ్యాపారితో డీల్ సెట్ చేసుకున్నాడు. బ్యాగ్ లో నుంచి రూ. 50 లక్షలు తను తీసుకుని మిగిలన మొత్తన్ని వ్యాపారికి ఇచ్చాడు. విషయం ఎవరికైనా చెబితే ఎన్‌కౌంటర్‌లో చంపేస్తానని బెదిరించి అక్కడి నుండి వెళ్లగొట్టాడు. 

డీల్ నచ్చక వ్యాపారి తదుపరి రోజు ఉన్నతాదికారులను ఆశ్రయించాడు. దీంతో మొత్తం కథ బయటపడింది. ఘటనపై ఎస్పీ గౌరవ్ గ్రోవర్ పోలీస్ అధికారి సింగ్ ను సస్పెండ్ చేశారు. అతని పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.