సంవత్సరాల తరబడి సేకరించిన డేటాని.. ఎన్నికల ఫలితాల రోజే చెరిపేసిండు

సంవత్సరాల తరబడి సేకరించిన డేటాని.. ఎన్నికల ఫలితాల రోజే చెరిపేసిండు

ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. పాత హార్డ్ డిస్క్ లను కట్టర్లు ఉపయోగించి డిస్మాటిల్ చేశాడని.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి పాత హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడని బయటపడింది. సంవత్సరాల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాల రోజు చెరిపేశాడని.. పాత హార్డ్ డిస్క్ ల పేరుతో కొత్త హార్డ్ డిస్క లను అమర్చాడని రిమాండ్ రిపోర్టులో తేలింది. 

ప్రణీత్ రావ్ నుంచి 3 సెల్ ఫోన్లతో పాటు ఒక లాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సాక్షాలు చెరిపివేత, పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్ నేరాలు లాంటి మూడు రకాలుగా నేరానికి పాల్పడ్డినట్లు తేలింది. 17 సిస్టంల ద్వారా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడని.. ఫోన్ టాపింగ్ కోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్ ను ప్రణీత్ కు కేటాయించారని తెలిసింది. రహస్యంగా ప్రముఖుల రికార్డింగ్స్ ను మానిటర్ చేశాడని, సేవ్ చేసుకున్న రికార్డ్స్ మొత్తాన్ని అక్రమంగా పర్సనల్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకునే వాడని వెల్లడైంది. 

ఈ కేసులో భాగంగా పలువురు ఎస్ఐబి అధికారులు, సిబ్బందిని  విచారించారు అధికారులు. ఐఓగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసిపి వెంకటగిరి.. టీంలో సభ్యులుగా బంజర హిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్లతోపాటు ఇద్దరు పంజాగుట్ట ఎస్సైలు ఈ కేసును విచారిస్తున్నారు. కొంతమందితో కలిసి ప్రణీత్ అక్రమాలకు పాల్పడ్డాడని.. తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే హార్డ్ డిస్క్ లను తొలగించాడని నిర్థారణ అయింది.