ముగిసిన రామచంద్ర భారతి, నందకుమార్ల పోలీసుల విచారణ

ముగిసిన రామచంద్ర భారతి, నందకుమార్ల పోలీసుల విచారణ

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ల పోలీసుల విచారణ ముగిసింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇవాళ ఉదయం రామచంద్ర భారతి, నందకుమార్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అలా విడుదల అయ్యారో లేదో జైలు బయటే ఇద్దరిని బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రామచంద్ర భారతిపై 420, 468, 471 మోటార్ వెహికల్ చట్టం 42, ఇన్ కమ్ టాక్స్ చట్టం, ఫేక్ పాన్ కార్డు కలిగి ఉన్నారనే కేసులో అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన స్థలంపై ఎలాంటి హక్కు లేకున్నా నందకుమార్ సబ్ లీజుతో బాంబే గార్మెంట్స్ పేరుతో స్టోర్స్ ఏర్పాటు చేశారు. రూ.13.50 లక్షలతో పాటు భారీగా పెట్టుబడి పెట్టి మోసపోయానంటూ మియాపూర్‌కు చెందిన బాధితులు గత నెల 15న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

రామచంద్ర భారతితోపాటు నందకుమార్ లను చంచల్ గూడ జైలు వద్దే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి.. ఇద్దరికీ వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు.