డీఎడ్,బీఎడ్ అభ్యర్థులపై లాఠీఛార్జ్.. మీడియాపై డీసీపీ అత్యుత్సాహం

డీఎడ్,బీఎడ్ అభ్యర్థులపై లాఠీఛార్జ్.. మీడియాపై డీసీపీ అత్యుత్సాహం

హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయం వద్ద బీఎడ్,డీఎడ్ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో  భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో అసెంబ్లీ వైపు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  పరిస్థితి అదుపుతప్పేలా ఉండటం అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.  పలువురి అభ్యర్థులకు ,నిరుద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి.  ఎక్కడిక్కడ డీఎస్సీ అభ్యర్థులను అరెస్ట్ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం 13వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని... అభ్యర్థుల డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను పెంచాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో 13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. కేవలం 5వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ రిలీజ్ చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోస్టులను పెంపుపై నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. 

డీసీపీ అత్యుత్సాహం

డీఎడ్..బీఎడ్ అభ్యర్థుల పైన  డీసీపీ వెంకటేశ్వర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. అభ్యర్థులను కొట్టండి ఈడ్చేయండంటూ పోలీసులకు ఆదేశాలివ్వడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా డీసీప తోసేశారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామంటూ మీడియాను హెచ్చరించారు.