ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎవరీ వేణుగోపాల్‌‌‌‌ రావు?

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎవరీ వేణుగోపాల్‌‌‌‌ రావు?

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో మరో అధికారి పేరు బయటకొచ్చింది. ఈ కేసులో రిటైర్డ్‌‌‌‌ ఏఎస్పీ వేణుగోపాల్‌‌‌‌రావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బంజారాహిల్స్ స్టేషన్ లో ఆయనను విచారించనున్నారు. వేణుగోపాల్‌‌‌‌ రావును విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వేణుగోపాల్‌‌‌‌ రావు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం వేణుగోపాల్‌‌‌‌ రావును ఎస్ఐబీలో అడిషనల్‌‌‌‌ ఎస్పీ(ఓఎస్డీ)గా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు నియమించారు. ప్రణీత్‌‌‌‌రావు, రాధాకిషన్ రావుతో కలిసి వేణుగోపాల్‌‌‌‌రావు కూడా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు.

ఎవరీ వేణుగోపాల్‌‌‌‌రావు?

వేణుగోపాల్‌‌‌‌రావుది.. వరంగల్ జిల్లా వార్దన్న పేట్ పార్వతగిరి  గ్రామం. 1989 బ్యాచ్ ఎస్ఐగా వేణుగోపాల్ సెలెక్ట్ అయ్యాడు. 2005లో కరీంనగర్ రూరల్ సిఐగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని వేణు గోపాల్ రావుపై ఎసిబి కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయి జైల్ కు వెళ్లిన వేణుగోపాల్ రావు సస్పెండ్ అయ్యారు. జమ్మికుంట ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న టైంలో వేణుగోపాల్ రావు వేదింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య  చేసుకున్నారు. చిగురు మామిడిలో వేణుగోపాల్ నేతృత్వంలో లాక్ ఆప్ డెత్ జరిగింది. ఈ ఘటనలో మరోసారి వేణుగోపాల్ రావు  సస్పెండ్ అయ్యాడు. 2013లో డీఎస్పీగా ప్రమోషన్ సంపాదించాడు. పెద్దపల్లి డీఎస్పీగా మొదటి పోస్టింగ్ కాగా.. ఎల్బీనగర్ చివరి పోస్టింగ్. ఎల్బీనగర్ ఏసీపీగా రిటైర్ అయ్యి SIBలో OSDగా వేణుగోపాల్ రావు కొనసాగారు. 7 ఏళ్ల పాటు ఎస్ఐబీలోవేణుగోపాల్ రావు  పన్ని చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి సారి తెరపైకి వేణుగోపాల్ రావు పేరు వచ్చింది. మాజీ డీసీపీ రాధ కిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో వేణుగోపాల్ పేరు చేర్చారు.