కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ :సునీల్ కనుగోలుకు మరోసారి సీఆర్పీసీ నోటీసులు

కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ :సునీల్ కనుగోలుకు మరోసారి సీఆర్పీసీ నోటీసులు

టీ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. సునీల్ కనుగోలు తరపున టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి నోటీసులను తీసుకున్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 26న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా ఆయన హాజరుకాకపోవడంతో సైబర్ క్రైం పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.

సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు ఇటీవలే దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీప్రతాప్‌, శశాంక్‌, ఇషాన్‌ శర్మలకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. పోలీసులు సోదాలు  నిర్వహించిన సమయంలో సునీల్‌ విదేశాల్లో ఉన్నారు. దీంతో భారత్కు తిరిగి వచ్చిన అనంతరం పోలీసులు ఆయనకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు.